గుమ్మాడీ గుమ్మాడి.. గిన్నిస్‌ కెక్కిన గుమ్మడి!

నెటిజన్లు తెగపొగిడేస్తున్న ఈ గిన్నిస్‌ గుమ్మడిని మీరూ చూసేయండి మరి!

Published : 28 Oct 2020 00:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హాలోవీన్‌ అనేది పాశ్చాత్య దేశాల్లో అత్యుత్సాహంగా జరుపుకునే పండుగ. దీనిని ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 31న మరణించిన వారి పట్ల గౌరవాన్ని తెలియచేసేందుకు జరుపుకొంటారు. కాగా దీనిని భారతదేశంలోనూ ఇటీవల జరుపుకొంటున్నారు. ఆ రోజు చిన్నారులు ‘ట్రిక్‌ ఆర్‌ ట్రీట్‌’ అంటూ మన దసరా పండుగలో పిల్లల మాదిరిగానే కానుకలు వసూలు చేస్తారు. ఇక అన్నిటినీ మించి ‘జాక్‌ ఓ లాంతర్న్‌’ అని పిలిచే గుమ్మడి కాయ ఈ పండుగకు ప్రత్యేక అలంకారం. ఇందుకుగాను ప్రతి ఇంట్లో ఓ గుమ్మడి కాయను కన్ను, ముక్కు, నోరు, ఆకృతులు కనబడేలా తొలిచి, లోపల దీపం వెలిగిస్తారు. దీనిని తయారు చేసేందుకు పిల్లలు పెద్దలు ఉత్సాహంగా పాల్గొంటారు. కాగా, ఈసారి హాలోవీన్‌ పండుగ సందర్భంగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద హాలోవీన్‌ గుమ్మడి కాయను గురించి ప్రకటించింది.
942 కేజీలకు పైగా బరువున్న ఈ గుమ్మడి జోసియా బ్రాంట్‌ అనే వ్యక్తి పొలంలో పండిందట. ఇక దీనిని 2018లో కాలిఫోర్నియాలో జరిగిన ఓ ఫెస్టివల్‌ కోసం మైక్‌ బ్రౌన్‌, డీన్‌ ఆర్నాల్డ్‌, బ్రాండీ డేవిస్‌ అనే వ్యక్తులు కలిసి చెక్కినట్టు గిన్నిస్‌ సంస్థ స్పష్టం చేసింది. మనిషి ముఖం ఆకారంలో చెక్కిన దీనిలోపల మరో ప్రత్యేకత ఉంది. అద్భుతంగా, భారీగా ఉందంటూ నెటిజన్లు తెగపొగిడేస్తున్న ఈ గిన్నిస్‌ గుమ్మడిని మీరూ చూసేయండి మరి!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని