చలికాలంలో జుట్టు రాలుతోందా?

తల వెంట్రుకలు రాలిపోతుంటే ఎంతో ఇబ్బందికరంగా అనిపిస్తుంది. జుట్టు సంరక్షణ కోసం ఎంతోమంది రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. మిగతా సీజన్‌లతో పోలిస్తే చలికాలంలో.. జట్టుకు చాలా సమస్యలే వస్తాయి. పొడిబారటం, కాంతిహీనంగా మారటం

Updated : 22 Dec 2020 04:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : తల వెంట్రుకలు రాలిపోతుంటే ఎంతో ఇబ్బందికరంగా అనిపిస్తుంది. జుట్టు సంరక్షణ కోసం ఎంతోమంది రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. మిగతా సీజన్‌లతో పోలిస్తే చలికాలంలో.. జట్టుకు చాలా సమస్యలే వస్తాయి. పొడిబారటం, కాంతిహీనంగా మారటం వంటి వాటితో పాటు కొసలు చిట్లీ గుర్రపు వెంట్రుకలను తలపిస్తాయి. మరి సీజన్‌ మార్పులకు తగట్టుగా జుట్టు సంరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటీ? ఆయుర్వేదం చూపిస్తున్న పరిష్కారాలు ఏమిటీ? ఆ వివరాలు మీకోసమే...

చలికాలంలో జుట్టు రాలటం అరికట్టటానికి ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాలను చూపిస్తోంది. కోడిగుడ్డు, పెరుగు, అరటిపండు, ఆలివ్‌ నూనె, నిమ్మరసాల మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలంటోంది. ఇలా చేయటం వల్ల మంచి ఫలితం కనిపిస్తుందని చెబుతోంది. 

మిశ్రమం తయారీ ఇలా...
రెండు టేబుల్‌ స్పూన్‌ల పెరుగులో ఒక గుడ్డు పగులగొట్టి వేయాలి. దీనికి సగం అరటి పండు కలపాలి. ఆలివ్‌ నూనె, నిమ్మరసాలను ఒక్కో టీస్పూన్ చొప్పున జోడించాలి. వాటితో పాటు విటమిన్‌ ఈ క్యాప్సుల్‌ కూడా కలపాలి. ఈ మొత్తాన్ని బాగా కలియతిప్పి మిశ్రమం తయారు చేయాలి. తలస్నానం చేసిన తరువాత జుట్టు కుదుళ్ల వరకు ఈ మిశ్రమాన్ని పట్టించాలి. పదిహేను నుంచి ఇరవై నిమిషాల తరువాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. అనేక పోషకాలు కలిగిన కోడిగుడ్డు కుదుళ్లకు బలాన్ని చేకూరుస్తుంది. పెరుగు వెంట్రుకల మూలాల దగ్గర నుంచీ పూర్తిగా శుభ్ర పరుస్తుంది. అరటి, ఆలివ్‌ నూనెలు పొడి బారిన జుట్టుకు జీవాన్ని తీసుకువస్తాయి. నిమ్మరసం వెంట్రుకలకు మెరుపు తెస్తుంది.

పొడిజుట్టు ఉన్నప్పుడు తలస్నానానికి ముందు నూనె పెట్టుకోవాలి. జింక్, బయోటిన్‌ వంటి పొషకాలున్న ఆహారాన్ని విరివిగా తీసుకోవాలి. తలను పదే పదే దువ్వటం, హెయిర్‌ డ్రైయ్యర్‌ను వాడటం వెంట్రుకలకు మేలు చేయదు. ఒత్తిళ్లు, ఆందోళనలు సాధ్యమయినంత వరకు తగ్గించుకోవాలి. చుండ్రు, పేను కొరుకుడు వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలి. ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో జుట్టు రాలటాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని