హాథ్రాస్‌ కేసు.. కుటుంబీకులతో 5 గంటల విచారణ

యూపీలోని హాథ్రాస్‌ జిల్లాలో యువతిపై దాడి జరిగి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు జరగటంతో ఈ కేసును అక్కడి ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురిని

Published : 17 Oct 2020 21:41 IST

న్యూదిల్లీ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రాస్‌ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ఈ కేసును ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన సీబీఐ శనివారం బాధిత కుటుంబీకులను 5 గంటల పాటు ప్రశ్నించింది. ఇందులో బాధితురాలి తల్లి, మరదలిని ఎక్కువ సేపు విచారించినట్లు సమాచారం. సీబీఐ అధికారులు విచారణలో భాగంగా ఇటీవల నలుగురు నిందితులను ప్రశ్నించారు. నలుగురిలో ఒకరితో బాధిత యువతి ఫోన్‌లో మాట్లాడేవారని.. అది ఇష్టం లేక బాధితురాలి కుటుంబ సభ్యులు యువతిని కొట్టి చంపారని అధికారులకు చెప్పారు. ఈ విషయం గురించి బాధితురాలి కుటుంబ సభ్యులను ఇవాళ సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే యువతి మృతదేహానికి అర్ధరాత్రి అంత్యక్రియలు జరిపిన తీరును అలహాబాద్‌ హైకోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని