టీకా దుష్పలితాలను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు

టీకాకు సంబంధించి దుష్పలితాలను ఎదుర్కొనేందుకు వీలుగా 10 వేల టీకా కేంద్రాల్లో ప్రత్యేక కిట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఒక్కో కేంద్రంలో ఒక్కో కిట్‌ను ఉంచనున్న క్రమంలో....

Published : 28 Dec 2020 18:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జనవరి నాటికి తెలంగాణలో కొవిడ్‌ టీకా అందుబాటులోకి రానుందనే అంచనాలతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. టీకాకు సంబంధించి దుష్పలితాలను ఎదుర్కొనేందుకు వీలుగా 10 వేల టీకా కేంద్రాల్లో ప్రత్యేక కిట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఒక్కో కేంద్రంలో ఒక్కో కిట్‌ను ఉంచనున్న క్రమంలో వాటిల్లో ఎలాంటి ఔషధాలు అవసరమో పేర్కొంటూ వైద్యారోగ్యశాఖ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. త్వరలో కిట్లను సిద్ధం చేయాలంటూ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.11.61 కోట్లతో ఈ ఔషధాలు, వస్తువుల కొనుగోలుకు అనుమతించింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 205 మంది కరోనా బారిన పడ్డారు. ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య 2,85,068కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,533కి చేరింది.

ఇవీ చదవండి...

3రోజులు.. 300లోపు కొవిడ్‌ మరణాలు

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ.. 66 మందికి కరోనా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు