కొవిడ్ సోకిన వృద్ధులకు గుండెపోటు? 

కొవిడ్‌ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధుల్లో గుండెపోటు రావటం సాధారణమే అని తాజా పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా 80 ఏళ్లు పైబడిన వారిలో ఇలాంటి ముప్పు సహజమేనని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కరోనా సోకిన వృద్ధుల్లో  ప్రమాదాలకు గల కారణాలు,

Published : 31 Dec 2020 01:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : కొవిడ్‌ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధుల్లో గుండెపోటు రావటం సాధారణమే అని తాజా పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా 80 ఏళ్లు పైబడిన వారిలో ఇలాంటి ముప్పు సహజమేనని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కరోనా సోకిన వృద్ధుల్లో  ప్రమాదాలకు గల కారణాలు, వారి ఆరోగ్య పరిస్థితులపై అమెరికా యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధన జరిపారు. వైరస్‌ బారినపడి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వయోవృద్ధుల్లో గుండెపోటు రావటాన్ని గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. వీటికి సంబంధించిన తాజా నివేదిక బీఎంజే జర్నల్‌లో ఇటీవలే ప్రచురితం అయింది. 
పరిశోధనలో భాగంగా అమెరికా వ్యాప్తంగా 68 ఆసుపత్రుల్లో తీవ్ర అస్వస్థతకు గురైన 5,019 మందిని పరిగణనలోకి తీసుకున్నారు. వీరంతా 80 ఏళ్లు పైబడి ఐసీయులో చికిత్స పొందుతున్న వారే. వీరిలో 701 మంది అంటే 14 శాతం ఆసుపత్రిలో చేరిన 14 రోజుల్లోనే గుండెపోటుకు గురైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరిలో 400 మందికి మాత్రమే సీపీఆర్ అందించటం ద్వారా ప్రాణాలను కాపాడినట్లుగా నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇలా గుండె సంబంధ సమస్యలు ఎదుర్కొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతున్న వారు కేవలం చిన్నపాటి సీపీఆర్‌ చేయటం ద్వారా ప్రాణాలతో బయటపడుతున్నారని నిపుణులు గుర్తించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వృద్ధుల్లో 80 ఏళ్లు పైబడిన వారిలోనే ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతున్నట్లు నిపుణులు స్పష్టం చేశారు. సీపీఆర్‌ చేసినప్పటికీ గుండె ఆగిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నట్లు తేల్చారు.




 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని