కొవిడ్‌ బాధిత వృద్ధుల్లో గుండెపోటు సాధారణం

తీవ్రస్థాయి కొవిడ్‌-19తో బాధపడుతున్న వృద్ధుల్లో గుండె పోటు తలెత్తడం సాధారణమని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా 80 ఏళ్లు దాటినవారిలో ఈ పరిస్థితి ఎక్కువగా ..

Updated : 03 Oct 2020 13:02 IST

వాషింగ్టన్‌: తీవ్రస్థాయి కొవిడ్‌-19తో బాధపడుతున్న వృద్ధుల్లో గుండె పోటు తలెత్తడం సాధారణమని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా 80 ఏళ్లు దాటినవారిలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటున్నట్టు తేల్చారు. మిషిగాన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు... కొవిడ్‌ బాధిత వృద్ధుల్లో మరణాలు చోటుచేసుకుంటున్న తీరుపై ఇటీవల అధ్యయనం సాగించారు. అమెరికాలోని 68 ఆసుపత్రుల ఐసీయూల్లో చికిత్స పొందిన 5,019 మంది కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితిని వీరు విశ్లేషించారు. ‘‘బాధితుల్లో 14% (701) మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే గుండె పోటుకు గురయ్యారు. వీరిలో 57% మందికి జీవాధార పరికరాలను అమర్చి, చికిత్స అందించాల్సి వచ్చింది. అయితే... 80 ఏళ్లు దాటిన వృద్ధుల్లో 3% మంది మాత్రమే కోలుకుని ఇళ్లకు వెళ్లారు. మిగతావారు మృతిచెందారు. 45 ఏళ్ల వయసులోపు వారిలో రికవరీ రేటు కొంచెం ఎక్కువగానే ఉంది’’ అని పరిశోధకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని