హైదరాబాద్‌లో భారీ వర్షం

భాగ్యనగరం వర్షంలో తడిసి ముద్దయింది. హైదరాబాద్‌లోని పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, సోమాజిగూడ, బేగంపేట, నాంపల్లి, అబిడ్స్‌

Updated : 10 Oct 2020 04:47 IST

హైదరాబాద్‌: భాగ్యనగరం వర్షంలో తడిసి ముద్దయింది. హైదరాబాద్‌లోని పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, సోమాజిగూడ, బేగంపేట, నాంపల్లి, అబిడ్స్‌, కోఠి, బేగంబజార్‌, ఎంజేమార్కెట్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, చార్మినార్‌, కాలాపత్తర్‌, పురానాపూల్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, మెహిదీపట్నం, శంషాబాద్‌, సికింద్రాబాద్‌, హబ్సిగూడ, ఉప్పల్‌, అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, చంపాపేట, ఎల్బీ నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై వర్షపునీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అంబర్‌పేట అలీకేఫ్‌ వద్ద భారీ వర్షానికి వంతెనపైకి మూసీ వరదనీరు వచ్చి చేరింది. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

పరిస్థితిపై విద్యుత్‌శాఖ సమీక్ష

నగరంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్‌శాఖ ఎస్‌ఈలు, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లతో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి సమీక్ష నిర్వహించారు. భారీగా వర్షం కురిసిన రాజేంద్రనగర్‌, సైబర్‌సిటీ, సెంట్రల్‌ సర్కిల్‌, సౌత్‌ సర్కిల్‌, బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌, హబ్సిగూడ, సరూర్‌నగర్‌ సర్కిళ్ల ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. వర్షం నీరు నిల్వ ఉన్నచోట విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా రోడ్లు, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే విద్యుత్‌ సిబ్బందికి తెలియజేయాలని రఘుమారెడ్డి సూచించారు. హోల్టేజ్‌లో హెచ్చుతగ్గులున్నా, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగినా 1912, 100తో పాటు కంట్రోల్‌ రూం నంబర్లు 7382072104, 7382072106,7382071574కు ఫోన్‌ చేసిన చెప్పాలని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని