హైదరాబాద్‌లో మళ్లీ వర్షం
నగరవాసులను వరుణుడు వెంటాడుతున్నాడు. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన భాగ్యనగరం ఇంకా తేరుకోకముందే మళ్లీ నగరవాసులను వరుణుడు వెంటాడుతున్నాడు. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన భాగ్యనగరం ఇంకా తేరుకోకముందే మళ్లీ తన
హైదరాబాద్: నగరవాసులను వరుణుడు వెంటాడుతున్నాడు. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన భాగ్యనగరం ఇంకా తేరుకోకముందే మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నాడు. తాజాగా నగరంలోని పలుచోట్ల వర్షం మళ్లీ మొదలైంది. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, బేగంబజార్, కోఠి, కింగ్ కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, నారాయణగూడ, లక్డీకపూల్, లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, జియాగూడ, మల్కాజ్గిరి, నాచారం, ముషీరాబాద్, కాప్రా, తార్నాక, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, చార్మినార్, సుల్తాన్ బజార్, జీడిమెట్ల, కొంపల్లి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.
అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
నగరంలో ఇవాళ మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో హైదరాబాద్ నగరపాలక సంస్థ అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని విభాగాలను, పోలీసులను అప్రమత్తం చేసింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఇటీవల పరిస్థితులు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు ఇప్పటికే కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలోని వందల కాలనీలు ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి. ఇవాళ మరోసారి భారీ వర్షం పడితే పరిస్థితి ఏంటని నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో లోతట్టుప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. జంటనగరాల్లోని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. పోలీసుల సాయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. దీంతో ముంపునకు గురైన ప్రాంతాల్లోని ప్రజలను యుద్ధప్రాతిపదికన కమ్యూనిటీ హాళ్లకు తరలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..