
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, పాతబస్తీ, బేగంపేట, బోయినిపల్లి, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, ప్యారడైజ్, కోఠి, సుచిత్ర, కత్బుల్లాపూర్, జీడిమెట్ల, బాలానగర్, కొంపల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఈరోజు, రేపు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు తరలించారు. మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.