‘గండికోట’ పిటిషన్లపై విచారణ వాయిదా

కడపజిల్లా గండికోట జలాశయ నిర్వాసితులకు నష్టపరిహారంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై దాఖలైన 4 పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం విచారించింది. అన్ని వ్యాజ్యాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ..

Published : 28 Sep 2020 14:24 IST

అమరావతి: కడపజిల్లా గండికోట జలాశయ నిర్వాసితులకు నష్టపరిహారంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై దాఖలైన 4 పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం విచారించింది. అన్ని వ్యాజ్యాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తర్వాతి విచారణను అక్టోబర్‌ 7కి వాయిదా వేసింది. తమకు పూర్తిస్థాయిలో పరిహారం అందించి పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణానికి రెండేళ్లు గడువు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గండికోట జలాశయ నిర్వాసితులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 2017 నాటికి ఉన్న కటాఫ్‌ డేట్‌ను ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీకి వరకు పెంచాలని వారు కోరుతున్నారు. ముంపు నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.12.50 లక్షలు అందజేయాలని వారు డిమాండ్‌ చేస్తు్న్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని