అమరావతి పిటిషన్లపై విచారణ వాయిదా

రాజధానికి సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లపై హైకోర్టులో విచారణ అక్టోబర్‌ 5కి వాయిదా పడింది. వచ్చేనెల 5 నుంచి రోజువారీ విచారణ చేపడతామని

Updated : 21 Sep 2020 14:00 IST

అమరావతి: రాజధానికి సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లపై హైకోర్టులో విచారణ అక్టోబర్‌ 5కి వాయిదా పడింది. వచ్చేనెల 5 నుంచి రోజువారీ విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. సాంకేతిక కారణాల రీత్యా హైబ్రిడ్‌ విధానంలో విచారణ చేపట్టాలని న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. దీనిపై వచ్చే నెల 5న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. మూడు రాజధానులు నిర్మిస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాలకు చెందిన పలువురు రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై పలుమార్లు విచారణ జరిగినప్పటికీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక విచారణకు అవకాశం లేకుండా పోయింది. అయితే తాజాగా న్యాయవాదులు విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని