హిమాచల్‌ప్రదేశ్‌ను కప్పేసిన హిమపాతం

హిమాచల్‌ప్రదేశ్‌ హిమమయమైంది. కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న మంచుతో ఎటు చూసినా శ్వేత వర్ణమే దర్శనమిస్తోంది. అనేక ప్రాంతాల్లోని రహదారులు, ఇళ్లు, వాహనాలను హిమం కప్పేసింది....

Published : 28 Dec 2020 15:50 IST

షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ హిమపాతం పెరిగిపోయింది. కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న మంచుతో ఎటు చూసినా శ్వేతవర్ణమే దర్శనమిస్తోంది. అనేక ప్రాంతాల్లోని రహదారులు, ఇళ్లు, వాహనాలను మంచు కప్పేసింది. రహదారులపై అడుగు లోతు మంచు పేరుకుపోవడంతో ప్రజలు పనుల కోసం బయటకు రాలేకపోతున్నారు. పలు ప్రాంతాల్లోని రహదారుల్లో రాకపోకలు కొనసాగించేందుకు ప్రభుత్వం యంత్రాల సాయంతో మంచును తొలగిస్తోంది. రానున్న రోజుల్లో హిమపాతం మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇవీ చదవండి...

వైభవంగా కేసీఆర్‌ దత్త పుత్రిక వివాహం

కన్నతల్లి ఇస్తుందట కరోనాను ఎదురించే శక్తి!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని