ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా పాపులర్?
ఇన్‌స్టాగ్రామ్.. ప్రస్తుతం యువతకి ప్రధాన సామాజిక మాధ్యమ వేదిక. నానాటికీ నయా అప్‌డేట్స్‌తో కుర్రకారు మదిని దోచేస్తుంది. దీంతో స్టోరీలతో సందడి చేస్తున్నారు. నయా ఫీచర్ రీల్స్‌తో అదరగొడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇన్‌స్టాగ్రామ్.. యువతకి ప్రధాన సామాజిక మాధ్యమ వేదిక. స్టోరీలతో సందడి చేస్తూ, రీల్స్‌తో అదరగొడుతున్నారు. మీకూ ఇన్‌స్టా ఖాతా ఉందా? ఫాలోవర్స్‌ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారా? అయితే ఈ చిట్కాలను పాటించండి. ఫాలోవర్స్‌ని పెంచుకోండి.
హ్యాష్‌ట్యాగ్‌లు...
నాణ్యమైన హ్యాష్‌ట్యాగ్‌లు వాడటం ద్వారా ఫాలోవర్లను పెంచుకోవచ్చు. మీరు పెట్టే ప్రతి పోస్ట్‌కి హ్యాష్‌ట్యాగ్‌లను జోడించండి. ఆ హ్యాష్‌ట్యాగ్‌లు మీ పోస్ట్‌కి సరిపడే విధంగా ఉండేలా జాగ్రత్తపడండి. దీంతో ఇన్‌స్టా ఖాతాదారులు అవసరం నిమిత్తం హ్యాష్‌ట్యాగ్‌లతో శోధిస్తే మీ ఖాతా కనిపిస్తుంది. మీ పోస్టుల నచ్చితే మిమ్మల్ని ఫాలో అవుతారు. పోస్ట్‌లన్నింటికీ ఒకే రకమైన హ్యాష్‌ట్యాగ్‌లు వాడకండి. వీలైనంత మేర కొత్త ట్యాగ్‌లను జోడించేలా చూసుకోండి.
కుదిరితే లైక్, వీలైతే కామెంట్
మీ అభిరుచులకు సరిపడే ఇన్‌స్టా ఖాతాదారులను ఫాలో అవ్వండి. దాని ద్వారా తిరిగి వారు ఫాలోబ్యాక్ (మిమ్మల్ని తిరిగి ఫాలో అవ్వడం) చేసే అవకాశం ఉంది. ఒకవేళ మీరు వ్యాపారులైతే.. మీ పోటీదారుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను వెతకండి. వారి పాలోవర్స్‌కి దగ్గరవండి. ఇది కూడా కొత్త ఫాలోవర్స్‌ని తీసుకొస్తుంది. కుదిరితే వారి ఫొటోలకు లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. ఓ అధ్యయనం ప్రకారం అభిరుచులకు సరిపడే వారి పోస్టులను లైక్ చేయడం ద్వారా 22 శాతం ఫాలోబ్యాక్ అవుతున్నారంట.
ఫొటోలకే పరిమితమవద్దు
ఫొటో షేరింగ్ నెట్‌వర్క్‌గా మొదలైన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు, లైవ్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ లాంటి ఆకట్టుకునే ఫీచర్లను తీసుకొచ్చింది. ఫొటోలు లేదా వ్యాపార ప్రచార చిత్రాలను మాత్రమే కాకుండా వీలుదొరికినప్పుడు వీడియో, సమయానుసారం ఓ స్టోరీని కూడా పోస్ట్ చేస్తుండండి. ఫొటోలతో పోలిస్తే వీడియోలు, స్టోరీలు చూసేవారు ఎక్కువ. దీంతో ఫాలోయింగ్ రేటు సులభంగా పెరుగుతుంది. వ్యాపార ప్రకటనల విషయంలో లైవ్ వీడియోలు, స్టోరీల ద్వారా వినియోగదారులకు మరింత త్వరగా చేరువవొచ్చు. అయితే అలా పోస్ట్ చేసే ఫొటోలు క్వాటిలీ ఉండేలా చూసుకోండి.
24 గంటలు సరిపోదనుకుంటే..
హ్యాష్‌ట్యాగ్‌లు మాత్రమే కాదు... ఫొటోని అందంగా తీర్చిదిద్దే ఫిల్టర్లనూ ఎంచుకోవాలి. ఫొటోని ఆకర్షణీయంగా మార్చే అనేక ఫిల్టర్లు ఇన్‌స్టా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫిల్టర్ల ద్వారా వినియోగదారులకు ఫొటో ఆకట్టుకునేలా కనిపించడంతో.. మీ ఖాతాని ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా ఇన్‌స్టా ఖాతాదారులు ఎక్స్-ప్రో 2 ఫిల్టర్‌ని వినియోగిస్తున్నారట. పోస్ట్ చేసే స్టోరీలలో హ్యాష్‌ట్యాగ్‌లతో పాటు ‘జియో ట్యాగ్’ను వాడటం ద్వారా ఎక్కువ మందికి చేరుతుంది. అంతే కాదు మీకు నచ్చినవి, మీ ప్రొఫైల్‌కి ఫాలోవర్స్‌ని ఆకర్షించే అవకాశం స్టోరీలను.. మీ ప్రొఫైల్‌కు హైలైట్‌గా పెట్టుకోండి. దీంతో 24 గంటలు ఉండే స్టోరీ.. ఓ ముఖ్యాంశంగా మీ హైలైట్స్‌లో ఉంటుంది.
తరచూ పోస్ట్ చేయండి
ఇన్‌స్టాలో తరచూ పోస్ట్‌లు చేస్తుండాలి. వీలైనంత వరకూ రోజూ ఓ సమయాన్ని ఎంచుకుని ఆ సమయానికే పోస్ట్ చేయాలి. ఏ సమయంలో ఇన్‌స్టా వినియోగదారులు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నారో గమనించాలి. ఆ సమయంలో పోస్ట్ చేయడం ద్వారా ఎక్కువ మంది వీక్షించొచ్చు. నచ్చితే ఫాలో అవొచ్చు. అంతేకాదు పోస్ట్ చేసే కంటెంట్ మీ సొంతమై ఉండేలా చూసుకోవాలి. ఖాతాదారుడు ఓ సెకను ఆగి మీ పోస్ట్ చూసేలా ఆకర్షణీయంగా ఉండాలి. వీలైనంత మేర ట్రెండింగ్‌లో ఉన్న అంశాలపై పోస్ట్ చేస్తుండాలి. వ్యాపారాల్లోనూ కొత్తగా వస్తున్న వస్తువులు, మార్పులను తెలియజేస్తుండాలి. ఓ సర్వే ప్రకారం వారంలో ఏడు అంతకంటే ఎక్కువ పోస్ట్‌లు చేస్తున్న ఖాతాకు ఫాలోయింగ్ రేటు పెరుగుతోందట.
ఫాలో అవ్వమని అడగండి...
ప్రతిసారి యూట్యూబర్ తన వీడియో పూర్తి చేసిన తర్వాత, తమ ఛానల్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకోమని అడుగుతున్నట్టుగానే మీరు అడగండి. అప్‌డేట్స్ నచ్చితే లేదా వ్యాపార బ్రాండ్ నచ్చితే మీ ఇన్‌స్టా ఖాతాను ఫాలో అవ్వమని అడగొచ్చు. ఇక ఫాలోవర్స్‌ని పెంచుకోవడంలో మీ బయో కూడా ముఖ్యమే. అక్కడ కూడా వీలైనంత వరకు హ్యాష్‌ట్యాగ్‌లనే వాడండి. మీ ఖాతా లేదా బ్రాండ్ గురించి బయోలో సింపుల్‌గా చెప్పండి. ఇక కొత్త ఫాలోవర్స్‌ని సంపాదించడం ఓ పనైతే.. ఉన్న ఫాలోవర్స్‌ని కాపాడుకోవడం మరో పని. అందుకే ఫాలోవర్స్‌తో ఎప్పుడూ దగ్గరగా ఉండాలి. వారి పోస్ట్‌లకి లైక్, లేదా కామెంట్ చేస్తుండాలి. మీ పోస్ట్‌కి వారు కామెంట్ చేస్తే తిరిగి సమాధానమివ్వాలి. ఇంకెందుకు ఆలస్యం... టిప్స్ ఫాలో అయిపోండి ఇన్‌స్టాలో ఫేమస్ అయిపోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Palnadu: తెదేపా నేత జూలకంటి బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం కేసు
-
Disney+Hotstar: క్రికెట్ ఫ్యాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్ గుడ్‌న్యూస్.. కొత్త ఫీచర్లతో రెడీ
-
Revanth Reddy: మోదీ నోట.. చీకటి మిత్రుడి మాట: రేవంత్
-
Vivek Ramaswamy: వివేక్ పిల్లల.. ‘కేర్ టేకర్’ జీతం రూ.80లక్షలు..?
-
Arunachal Border: భారత సరిహద్దులో.. చైనా, పాకిస్థాన్‌ల సమావేశం!
-
Asian Games 2022: ఆసియా క్రీడలు.. అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకాల వర్షం