నీటికొచ్చిన చిరుత.. వేటాడిన మొసలి

మొసలి పట్టు గురించి అందరికి తెలిసిందే.. నీటిలో ఉన్నప్పుడు దాని బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏనుగును సైతం తన నోటితో కట్టిపడేయగల బలశాలి. తాజాగా.. ఇలాంటి ఘటనే దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది. ఓ చిరుతపులి పిల్ల నీరు తాగేందుకు సమీపంలోని కుంట ఒడ్డు వద్దకు వచ్చింది.

Published : 25 Dec 2020 01:54 IST

కేప్‌టౌన్‌: మొసలి పట్టు గురించి అందరికి తెలిసిందే.. నీటిలో ఉన్నప్పుడు దాని బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏనుగును సైతం తన నోటితో కట్టిపడేయగల బలశాలి. తాజాగా.. ఇలాంటి ఘటనే దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది. ఓ చిరుతపులి పిల్ల నీరు తాగేందుకు సమీపంలోని కుంట ఒడ్డు వద్దకు వచ్చింది. చిరుతపులి పిల్ల నీరు తాగుతుండగా అప్పటికే నీళ్లలో దాగి ఉన్న 13 అడుగుల పొడవున్న నైల్‌జాతికి చెందిన ఓ పెద్ద మొసలి ఒక్కసారిగా చిరుతపై మెరుపుదాడి చేసింది. దాని శక్తివంతమైన దవడలతో చిరుతను నోట కరచుకొని నీటిలోకి లాక్కెళ్లింది. 
ఆ సమయంలో అక్కడే ఉన్న దక్షిణాఫ్రికా వైల్డ్‌ ఎర్త్‌ సఫారీకి చెందిన గైడ్‌లు బియాండ్‌ ఫిండా, బుసానీ మాలీ మొసలి చిరుతపులి పిల్లను నీటిలోకి లాక్కెళ్లడం వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. నీళ్లు తాగేందుకు వచ్చిన చిరుతపులిపిల్లను పెద్ద మొసలి లాక్కెళ్లడం బాధాకరమైన ఘటన అని వారు పేర్కొన్నారు. కాగా.. ఇదంతా ఒడ్డున ఉండి గమనిస్తున్న తల్లి చిరుత.. చేసేదేం లేక బాధతో అటుఇటు తిరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నైల్‌జాతికి చెందిన పెద్ద మొసళ్లు అత్యంత శక్తివంతమైనవని, అవి దూకుడుగా వ్యవహరిస్తాయని వారు చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని