మెట్రో రైల్‌ ప్రయాణ సమయాల్లో మార్పులు

నగర ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రయాణ సమయాన్ని పొడిగించారు. రేపటి నుంచి ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు సర్వీసులు నడపనున్నట్లు మెట్రో

Updated : 03 Dec 2020 01:12 IST

వెల్లడించిన మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

హైదరాబాద్‌: నగర ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రయాణ సమయాన్ని పొడిగించారు. రేపటి నుంచి ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు సర్వీసులు నడపనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఉదయం 7 గంటలకు మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యేవని.. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు 30 నిమిషాలు ముందుగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇక రాత్రి సమయంలో ఎలాంటి మార్పుల్లేవని.. గతంలోలాగే చివరి ట్రైన్ రాత్రి 9.30 గంటలకు ఉంటుందని స్పష్టం చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో లాక్‌డౌక్‌ కారణంగా ప్రయాణికులకు అందుబాటులో లేకుండా పోయిన భరత్‌నగర్‌, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్‌ మెట్రో స్టేషన్లు రేపటి నుంచి తెరుచుకోనున్నట్లు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని