హైదరాబాద్‌లో మెట్రోకు పచ్చజెండా

కొవిడ్‌ అన్‌లాక్‌-4 మార్గదర్శకాల్లో భాగంగా ఈ నెల 7 నుంచి మెట్రో రైళ్లు నడిపేందుకు కేంద్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు పట్టణాభివృద్ధి, రైల్వే, కేంద్ర హోంశాఖను సంప్రదించి దశలవారీగా మెట్రో కార్యకలాపాలు ప్రారంభించుకోవాలని కేంద్రం ఇప్పటికే సూచించింది.

Published : 02 Sep 2020 01:50 IST

హైదరాబాద్‌: కొవిడ్‌ అన్‌లాక్‌-4 మార్గదర్శకాల్లో భాగంగా ఈ నెల 7 నుంచి మెట్రో రైళ్లు నడిపేందుకు కేంద్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు పట్టణాభివృద్ధి, రైల్వే, కేంద్ర హోంశాఖను సంప్రదించి దశలవారీగా మెట్రో కార్యకలాపాలు ప్రారంభించుకోవాలని కేంద్రం ఇప్పటికే సూచించింది. తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా హైదరాబాద్‌ మెట్రో సేవలు పునఃప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఈ నెల‌ 7వ తేదీ నుంచి మెట్రో సర్వీసులు ప్రారంభించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. గ్రేడెడ్‌ పద్ధతిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు లోబడి రైళ్లలో కరోనా వ్యాప్తి జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల మెట్రోల ఎండీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్వీఎస్‌ రెడ్డి పాల్గొన్నారు. రైళ్లలో శానిటైజేషన్‌, భౌతిక దూరం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని