
Published : 20 Aug 2020 15:45 IST
కరోనాకు చాలా భయపడ్డా: మహమూద్ అలీ
హైదరాబాద్: ప్లాస్మా దానం చేయడం వల్ల జీవితాలను కాపాడుకోవచ్చని తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందని చెప్పారు.హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్లాస్మా దానం అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. తనకు కరోనా సోకినప్పుడు చాలా భయపడ్డానన్నారు. ఆస్తమా ఉన్నప్పటికీ ధైర్యంతో వైరస్‌ను ఎదుర్కొన్నానని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో కరోనా మరణాల శాతం తక్కువగా ఉందని, రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో పోలీసులు బాగా పని చేశారని కితాబిచ్చారు. కరోనా కారణంగా హైదరాబాద్‌లో చాలా వ్యాపారాలు నష్టపోయాయన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని హోం మంత్రి కోరారు.
Tags :