చుట్టూ వరద, చెట్టుకొమ్మే ఆధారం..

ఏ మాత్రం అదుపు తప్పినా వ్యక్తి గల్లంతయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో... వైమానిక సిబ్బంది అతని ప్రాణాలను కాపాడిన ఒళ్లు గగుర్పొడిచే ఘటన

Published : 17 Aug 2020 10:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరద నీటిలో చిక్కుకుపోయిన ఓ వ్యక్తి ప్రాణాలను భారతీయ వైమానిక దళ సిబ్బంది రక్షించారు. ఈ సంఘటన ఛత్తీస్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్‌ సమీపంలో ఖుతాఘాట్‌ ప్రాంతం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రతన్‌పూర్‌ సమీపంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. భారీ వరదలో చిక్కుకున్న ఓ వ్యక్తి..  కొట్టుకుపోకుండా తనను తాను రక్షించుకోవటానికి ఓ బండరాయి మీద, ఓ చెట్టు కొమ్మను పట్టుకున్నాడు. వరదనీరు ఏ మాత్రం తగ్గుముఖం పట్టక పోవటంతో అతను ఆగస్టు 16 సాయంత్రం నుంచి అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. కాగా, ఈ సమాచారం అందిన వైమానిక దళం ఆగస్టు 17 ఉదయం రంగంలోకి దిగింది. అయితే, ప్రవహిస్తున్న వరదకు గాలి తోడై, సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ఏ మాత్రం అదుపు తప్పినా వ్యక్తి గల్లంతయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో... వైమానిక సిబ్బంది అతని ప్రాణాలను కాపాడారు. ఆ వైరల్‌ వీడియోను మీరూ చూడండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని