హిమాచల్‌ప్రదేశ్‌లో జాతీయ ఐస్‌ హాకీ టోర్నమెంట్‌

హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీలో నూతనంగా నిర్మించిన ఓపెన్‌ ఎయిర్‌ రింక్‌లో జాతీయ ఐస్‌ హాకీ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్లు శుక్రవారం అధికారులు వెల్లడించారు.

Published : 26 Dec 2020 00:35 IST

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీలో నూతనంగా నిర్మించిన ఓపెన్‌ ఎయిర్‌ రింక్‌లో జాతీయ ఐస్‌ హాకీ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్లు శుక్రవారం అధికారులు వెల్లడించారు. భారత ఐస్‌ హాకీ అసోసియేషన్‌ ఈ ఓపెన్‌ ఎయిర్‌ రింక్‌ను అభివృద్ధి చేశారు. ‘‘అండర్‌-20 ఐస్‌ హాకీ టోర్నమెంట్‌ను మొదటిసారిగా హిమాచల్‌ప్రదేశ్‌లో నిర్వహిస్తున్నాం. జనవరి 27 నుంచి ఈ టోర్నమెంట్‌ మొదలుకానుంది.’’ అని భారత ఐస్‌ హాకీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి హర్జిందర్‌ సింగ్‌ తెలిపారు. గురువారం కాజా పట్టణంలో ఒక శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ఐస్‌ రింక్‌ 31×61 మీటర్ల పరిమాణంలో తయారు చేశారు. ఇది భూమికి 3,720 మీటర్ల ఎత్తులో, లేహ్‌ కన్నాపైన ఉంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనస్‌ 20 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంది. ఇక్కడ త్వరలో స్కీయింగ్‌ను కూడా ప్రారంభిస్తామని హర్జిందర్‌ సింగ్‌ తెలిపారు. ప్రస్తుతం ఎనిమిది నుంచి 20 సంవత్సరాలలోపు చిన్నారులకు ఐస్‌ హాకీలో శిక్షణనిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జాతీయ కోచ్‌ అమిత్‌ బెర్వాల్‌ ఆధ్వర్యంలో 165 మంది శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. వీరిలో కొందరిని జాతీయ టోర్నమెంటుకు ఎంపిక చేస్తామన్నారు. జిల్లా క్రీడాధికారి జివాన్‌ నేగి మాట్లాడుతూ.. ఇక్కడ చిన్నారుల్లో ఐస్‌ హాకీ పట్ల స్పందనను తెలుసుకొనేందుకు ఒక టెన్నిస్‌ కోర్టును హాకీ రింక్‌గా మార్చామని తెలిపారు. దీనికి మంచి స్పందన లభించడంతో శాశ్వత రింక్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.

ఇవీ చదవండి..

సారీ చెబితే చైనీయులను వదిలేస్తాం..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు