ఐరాస చరిత్రలో అతిపెద్ద సవాల్‌: సాధారణ సభ

కొవిడ్‌పై అంతర్జాతీయ పోరాటం కోసం ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్‌ సహా 168 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి.

Published : 12 Sep 2020 23:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌పై అంతర్జాతీయ పోరాటం కోసం ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్‌ సహా 168 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 193 దేశాల సభ్యత్వం కలిగిన ఐరాస సాధారణ సభలో అమెరికా, ఇజ్రాయిల్‌ ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా ఉక్రెయిన్‌, హంగేరి సహా పలుదేశాలు ఓటింగ్‌కు గైర్హజరయ్యాయి. కొవిడ్‌-19పై పోరాటంలో సమగ్ర, సమన్వయ స్పందన పేరుతో రూపొందించిన ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా కరోనా  వైరస్‌ను సాధారణ సభ.. ఐక్యరాజ్య సమితి చరిత్రలోనే అతిపెద్ద సవాల్‌గా అభివర్ణించింది. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అంతర్జాతీయ సహకారం అందించుకోవాలని పిలుపునిచ్చింది. మహమ్మారి వల్ల ఉద్భవిస్తున్న సామాజిక, ఆర్థిక ప్రభావాలపై అంకితభావం, దృఢత్వంతో కూడిన చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనిపై చర్చలో పాల్గొన్న అమెరికా ప్రతినిధులు ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనాలపై విమర్శలు గుప్పించారు. కరోనా వ్యాప్తి చైనా వాస్తవాలను దాచిపెట్టిందని అమెరికా ఆరోపించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని