ఇది పాముల సయ్యాటా.. కయ్యాలాటా? 

సహజంగా పాములంటే అందరికీ భయమే. అవి చిన్నవైనా పెద్దవైనా ప్రాణ భయంతో ఆమడ దూరం పరిగెడతాం. కానీ అవే పాములు ఎక్కడైనా సయ్యాడుతుంటే లేదా...

Updated : 07 Aug 2020 10:01 IST

వైరల్‌ వీడియోకు నెటిజన్ల భిన్నాభిప్రాయాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: సహజంగా పాములంటే అందరికీ భయమే. అవి చిన్నవైనా పెద్దవైనా ప్రాణ భయంతో ఆమడ దూరం పారిపోతారు. కానీ అవే పాములు ఎక్కడైనా సయ్యాడుతుంటే లేదా కయ్యాలాడుతుంటే ఆసక్తిగా తిలకిస్తారు. అప్పుడప్పుడూ సామాజిక మాధ్యమాల్లో అలాంటి వీడియోలు కూడా మనం ఇదివరకు చూసి ఉంటాం. కానీ, శుక్రవారం ఒడిశాకు చెందిన సుశాంత నందా అనే ఓ ఇండియన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ట్వీట్‌ చేసిన ఓ వీడియో ఆసక్తితో పాటు ఆశ్చర్యం కలిగిస్తోంది. 

తొలుత మురికి నీటిలో పోటాపోటీగా ఆడిన సర్పాలు తర్వాత ఒక్కసారిగా పైకి లేచాయి. గట్టుపైకి చేరి ఒకదానితో మరొకటి తలదూశాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో పోస్టు చేసిన అధికారి.. ఆ రెండు పాములు ఎలుకలు తినేవి అని చెప్పడంతో పాటు అవి ఆధిపత్య పోరు కోసం కొట్లాడుతున్నాయని చెప్పారు. అయితే, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అవి సయ్యాటలాడుతున్నాయని కొందరు అంటుండగా, మరికొందరు కయ్యాలాడుతున్నాయని కామెంట్లు పెడుతున్నారు. మీరు కూడా ఒకసారి ఆ వీడియో చూసి ఆస్వాదించండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని