ఐఆర్‌సీటీసీ ఇకపై మరింత మెరుగ్గా..!

భారత రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) ఈ-టికెటింగ్‌ వెబ్‌సైట్‌లో ప్రయాణికుల బుకింగ్‌ సౌలభ్యం కోసం మెరుగైన ఫీచర్లు జోడిస్తున్నామని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ శుక్రవారం తెలిపారు.

Published : 25 Dec 2020 21:56 IST

దిల్లీ: భారత రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) ఈ-టికెటింగ్‌ వెబ్‌సైట్‌లో ప్రయాణికుల బుకింగ్‌ సౌలభ్యం కోసం మెరుగైన ఫీచర్లు జోడిస్తున్నామని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ శుక్రవారం తెలిపారు. వినియోగదారులు సులభంగా దీనిని వాడుకొనేలా ఈ వెబ్‌సైట్‌ను అప్‌డేట్‌ చేస్తున్నట్లు రైల్వేశాఖ ఒక అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపారు. కేంద్ర రైల్వే, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ ఈ-టికెటింగ్‌ వ్యవస్థ నవీకరణ పనులను సమీక్షిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 2014 నుంచి ఈ టికెటింగ్‌ వ్యవస్థలో భాగంగా ప్రయాణికుల టికెట్ బుకింగ్‌తో పాటు ప్రయాణ సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కృషి చేస్తోంది. ఇది ప్రయాణికులకు మొదటి మిత్రుడిగా మారిందని ఆ ప్రకటనలో తెలిపారు. దీనిని వినియోగించిన వారికి సౌకర్యం, స్నేహపూర్వక అనుభవాల్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఈ డిజిటల్‌ ప్రపంచంలో ప్రజలు ఎక్కువశాతం ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకొనేందుకే మొగ్గు చూపుతున్నారు. అందువల్ల ఐఆర్‌సీటీసీని నిరంతరం మెరుగుపరుస్తుంటామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

గుండెపోటుకు వజ్ర చికిత్స

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని