
Published : 26 Jul 2020 11:16 IST
శ్రీరాంసాగర్కు పెరుగుతున్న ఇన్ఫ్లో
హైదరాబాద్: మహారాష్ర్ట, తెలంగాణలోని ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 22 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 6,287 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నట్లు చెప్పారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,074 అడుగుల నీరు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 90.313 టీఎంసీలు.
Advertisement
Tags :