శివన్‌ పదవీకాలం పొడిగింపు 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ కె.శివన్‌ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. ప్రస్తుతం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ సెక్రటరీ, స్పేస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్న ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ.......

Published : 30 Dec 2020 22:29 IST

దిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ కె.శివన్‌ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. ప్రస్తుతం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ సెక్రటరీ, స్పేస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్న ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో 2022 జనవరి 14 వరకు ఆయన ఇస్రో చీఫ్‌గా కొనసాగేందుకు అవకాశం కలిగింది. శివన్‌ 2018 జనవరి 10న ఇస్రో ఛైర్మన్‌గా నియమితులైన విషయం తెలిసిందే. అప్పటి ఛైర్మన్‌గా ఉన్న ఏకే కిరణ్‌ కుమార్‌ నుంచి జనవరి 14న బాధ్యతలు స్వీకరించారు.

ఇదీ చదవండి..

ఆక్స్‌ఫర్డ్‌ టీకా: ఏ గేమ్‌ ఛేంజర్‌!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని