ఫిబ్రవరి 23 నుంచి జేఈఈ మెయిన్‌

దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్‌-2021 ఎంట్రన్స్‌ పరీక్ష షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ బుధవారం......

Updated : 17 Dec 2020 04:16 IST

దిల్లీ: దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్‌-2021 ఎంట్రన్స్‌ పరీక్ష షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ బుధవారం ప్రకటించారు. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జేఈఈ మెయిన్‌ పరీక్షలు జరగనున్నాయని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అలాగే మొత్తం నాలుగు సార్లు జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తొలిసారి ఫిబ్రవరిలో నిర్వహించనుండగా.. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో మరో మూడు సార్లు పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. తదుపరి సెషన్లలో పరీక్షలు జరిగే తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు. ప్రతి సెషన్‌ పరీక్షా ఫలితాలను నాలుగైదు రోజుల్లోనే ప్రకటించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, బెంగాలీ, గుజరాతీ, అస్సామీ, కన్నడ, మరాఠీ, పంజాబ్‌, తమిళ్‌, ఉర్దూ, ఒడియా, మలయాళం.. ఇలా మొత్తం 13 భాషల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ జరగనుందని మంత్రి తెలిపారు. అలాగే ఈ సారి పరీక్ష విధానంలో కూడా మార్పులు చేశారు. 90 ప్రశ్నలకు గాను 75 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని, లేదంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ విభాగాల్లో 30 ప్రశ్నలకు 25 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా విద్యార్థి నాలుగుసార్లూ పరీక్షకు హాజరైతే ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. జేఈఈ మెయిన్‌ కోసం డిసెంబర్‌ 16 నుంచి జనవరి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చాన్నారు. అప్లికేషన్‌ ఫారంలను jeemain.nta.nic.in నంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.

ఇదీ చదవండీ..

ఇక ఇంటివద్దే కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష‌!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని