2400 ఏళ్ల ఈజిప్టు మమ్మీని కాపాడి..

రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌ను వర్షాలు ముంత్తుతున్నాయి. ఈ క్రమంలోనే..

Published : 19 Aug 2020 15:32 IST

జైపుర్‌: రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రజలను రక్షించేందుకు పలు రకాల సహాయక చర్యలు చేపడుతుండగా.. ఓ మ్యూజియం సిబ్బంది మాత్రం ఈజిప్టు మమ్మీని కాపాడేందుకు  శాయశక్తులు ఒడ్డారు. మ్యూజియంలోకి నీరు చేరడంతో గ్లాస్‌ ఛాంబర్‌లో ఉంచిన 2,400 సంవత్సరాల ఈజిప్ట్‌ మమ్మీని పాడవకుండా రక్షించేందుకు తీవ్రంగా శ్రమించారు. మ్యూజియంలోకి చేరిన నడుము లోతు నీటిలో సెల్‌ఫోన్‌ లైట్ల వెలుతురులో ఛాంబర్‌ గ్లాసును బద్దలు కొట్టి అతి కష్టం మీద మమ్మీని మ్యూజియంలో నీరు చేరని చోటికి తరలించారు. 

‘2016 నుంచి ప్రదర్శనకు ఉంచిన 2400 ఏళ్ల ప్రాచీన మమ్మీని అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం. దానిని వీక్షించేందుకు దేశ విదేశాలనుంచి ఎంతో మంది సందర్శకులు వస్తుంటారు. ఆ మమ్మీ వెలకట్టలేనిది’ అని మ్యూజియం సూపరింటెండెంట్ రాకేశ్‌‌ చోలక్‌ తెలిపారు. ‘మమ్మీకి ఎలాంటి డ్యామేజీ జరగకుండా సకాలంలో దానిని కాపాడాం. వర్షాలు, వరదలు మ్యూజియంలోని 17 వేల కళాఖండాలపై ప్రభావం చూపాయి’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని