తొలి జేమ్స్‌బాండ్‌ హీరో మృతికి కారణం ఇదే..

జేమ్స్‌ బాండ్‌ తొలి పాత్రధారి సీన్‌ కానరీ గత నెల కన్నుమూసిన విషయం తెలిసిందే. 90వ పుట్టిన రోజు జరుపుకున్న ఆయన మూడు నెలలు తిరగకుండానే మృతి

Updated : 27 Feb 2024 14:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : జేమ్స్‌ బాండ్‌ తొలి పాత్రధారి సీన్‌ కానరీ గత నెల కన్నుమూసిన విషయం తెలిసిందే. 90వ పుట్టిన రోజు జరుపుకొన్న ఆయన మూడు నెలలు తిరగకుండానే మృతి చెందడంతో హాలీవుడ్‌ పరిశ్రమతో పాటు ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఆయన మృతికి గల కారణాలు వెల్లడయ్యాయి. నిద్రలోనే కన్నుమూసిన ఆయనకు వయసు భారంతో పాటు నిమోనియా ఉండటం వల్ల గుండె పని చేయడం ఆగిపోయింది. ఈ కారణంతో ఆయన మృతి చెందినట్లు డెత్‌ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. 

తొలుత ఈయన మృతికి సంబంధించి కారణాలు వెల్లడి కాలేదు. సహజ మరణంగానే అందరూ భావించారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న కానరీ ఆస్కార్‌ పురస్కారంతో పాటు చాలా ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు. 2006లో అమెరికా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న కానరీ తన నట జీవితానికి విరామం పలికారు. జేమ్స్‌ బాండ్స్‌ పాత్రధారిగా ఆయన ఆరు చిత్రాల్లో నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు