Published : 03 Nov 2020 21:58 IST

కంగన రనౌత్‌పై పరువు నష్టం దావా! 

సుశాంత్‌ కేసులోకి లాగినందుకన్న ప్రముఖ గేయ రచయిత

ముంబయి : బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌పై ప్రముఖ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగేలా కంగన పలు మీడియా ఛానళ్లలో వ్యాఖ్యలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముంబయిలోని అంధేరి మెట్రోపాలిటన్‌ మేజిస్ర్టేట్‌ను ఆశ్రయించిన ఆయన నటిపై దావా వేశారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంలో‌ మిస్టరీకి సంబంధించి న్యాయం జరగాలని కంగనా ట్విటర్‌ వేదికగా పలుమార్లు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఆమె పలు ఛానళ్లలో దీనిపై మాట్లాడారు. ఈ సందర్భంగా కంగన తన పేరును సుశాంత్‌ కేసులోకి అన్యాయంగా లాగినట్లు ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తనపై కంగన వ్యాఖ్యలు ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని జావేద్‌ అక్తర్‌ పేర్కొన్నారు. ఈ దావా కేసుకు సంబంధించి డిసెంబరు 3న ధర్మాసనం వాదనలను విననుంది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని