జగన్‌ కేసుల విచారణ మరో బెంచ్‌కు బదిలీ

న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ లేఖ రాసి దాన్ని బహిర్గతం చేసిన

Updated : 16 Nov 2020 20:40 IST

దిల్లీ: న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ లేఖ రాసి దాన్ని బహిర్గతం చేసిన ఏపీ సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు అజేయకల్లంపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ మరో ధర్మాసనానికి బదిలీ అయింది. జగన్‌కు వ్యతిరేకంగా దాఖలైన మూడు పిటిషన్లపై జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్లలో వాది, ప్రతివాదుల్లో ఒకరి తరఫున న్యాయవాదిగా పనిచేసిన సమయంలో వాదనలు వినిపించినందున తాను ఈ కేసు విచారణ చేపట్టలేనంటూ జస్టిస్‌ యు.యు.లలిత్‌ ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించిన మరో ధర్మాసనం జాబితాలో ఈ కేసును చేర్చనున్నట్లు జస్టిస్‌ లలిత్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మరో ధర్మాసనంలో ఈ పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశముంది. 

న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సీఎం జగన్‌ లేఖ రాయడం, దాన్ని అజేయకల్లం బహిర్గతం చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. రాజ్యాంగబద్ద పదవిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడినందున జగన్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌కుమార్ పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో జగన్‌పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని మరో న్యాయవాది సునీల్‌కుమార్‌ సింగ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. నిరాధార ఆరోపణలు చేసిన జగన్‌పై చర్యలు తీసుకోవాలని యాంటీ కరప్షన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్ట్‌ పిల్‌ వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని