డబుల్‌ డెక్కర్‌ జ్ఞాపకాలలో...మంత్రి కేటీఆర్‌

డబుల్‌ డెక్కర్‌ బస్సుల గురించి మీకు తెలుసా! అప్పట్లో ..హైదరాబాద్‌లో నగరంలో ఇవి బహుప్రాచుర్యం పొందాయి. కానీ కాల క్రమేణా కనిపించకుండా పోయాయి. తాజాగా..మంత్రి కేటీఆర్‌ వీటి గురించి గుర్తుచేసుకున్నారు.

Published : 08 Nov 2020 02:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : డబుల్‌ డెక్కర్‌ బస్సుల గురించి మీకు తెలుసా! అప్పట్లో ..హైదరాబాద్‌ నగరంలో ఇవి అత్యంత ప్రాచుర్యం పొందాయి. కానీ కాల క్రమేణా కనిపించకుండా పోయాయి. తాజాగా.. మంత్రి కేటీఆర్‌ వీటి గురించి గుర్తుచేసుకున్నారు. ఆ డబుల్‌ డెక్కర్‌ బస్సులతో తనకు ఉన్న అనుభూతులను పంచుకున్నారు. అవకాశం ఉంటే అలాంటి బస్సులను తిరిగి ప్రారంభించాలన్నారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రిని కోరారు.

గతంలో 7Z‌ డబుల్‌ డెక్కర్‌ ఆర్టీసీ బస్సు ప్రయాణికులను అప్జల్‌ గంజ్‌ నుంచి జూపార్క్‌ వరకు తీసుకెళ్లేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. బస్సులోంచి వారు నగర అందాలను వీక్షిస్తూ మైమరిచి పోయేవారని గుర్తుచేసుకున్నారు. గత స్మృతులను తలచుకుంటూ.. నాటి డబుల్‌ డెక్కర్‌ బస్సులకు సంబంధించిన ఫొటోనూ జతచేస్తూ ఓ వ్యక్తి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. దీనిపై ఆయన స్పందించారు‌. తనకు కూడా ఆ మధుర జ్ఞాపకాలు ఉన్నాయని.. అబిడ్స్‌లోని పాఠశాలలో చదివిన రోజులను గుర్తుచేసుకుంటూ రీట్వీట్‌ చేశారు. కేటీఆర్‌ ట్వీట్పై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ స్పందించారు. ఏమాత్రం అవకాశం ఉన్నా.. ప్రస్తుత హైదరాబాద్‌ రోడ్లపై మళ్లీ డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపేలా ఆర్టీసీకి సూచిస్తానని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని