హైదరాబాద్‌ నలువైపులా అభివృద్ధే ధ్యేయం

భాగ్యనగరంలో ఐటీ రంగం పురోగతి బాగుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 15 Jul 2020 15:55 IST

హైదరాబాద్‌: భాగ్యనగరంలో ఐటీ రంగం పురోగతి బాగుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఐటీ అభివృద్ధిలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు ఎక్కువగా ఉందని చెప్పారు. ఉప్పల్‌లో బుధవారం నిర్వహించిన హైదరాబాద్‌ ఐటీ గ్రిడ్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న ఆయన.. ఎంఎంటీఎస్‌ను రాయగిరి వరకు పొడిగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు.

నగరంలో నలువైపులా సమాన అభివృద్ధి జరగాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అందుకే గ్రిడ్‌ విధానంలో అభివృద్ధి అన్ని ప్రాంతాలను చేస్తున్నామని చెప్పారు. ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు స్కైవే నిర్మాణం జరుగుతోందని, అంబర్‌ పేట్‌- రామాంతపూర్‌ వరకు మరో ఫ్లైఓవర్‌ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో మౌలిక వసతులు పెరగడంతో పాటు వ్యాపార, వాణిజ్య అవకాశాలు కూడా పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో ఏ రంగంలో పెట్టుబడి పెట్టినా వృద్ధి కనిపిస్తోందని కేటీఆర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని