Published : 23 Nov 2020 18:33 IST

బొంబాయి హైకోర్టును ఆశ్రయించిన కంగన

* మూడోసారి సమన్లు జారీ చేసిన ముంబై పోలీసులు
*  ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాల్సిందిగా నటి అభ్యర్థన


ముంబై:  నటి కంగనా రనౌత్‌, ఆమె సోదరి రంగోలి సోమ, మంగళవారాల్లో తమ ముందు హాజరు కావాలని మహరాష్ట్ర పోలీసులు మూడోసారి సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కంగన తమపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాల్సిందిగా బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. కంగన, రంగోలి సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ మున్వర్‌అలీసయ్యద్‌ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారిని విచారించేందుకు ముంబై పోలీసులు ఇప్పటికే రెండుసార్లు సమన్లు జారీ చేశారు. అయినా వారు హాజరు కాలేదు. వారిరువురూ తమ సోదరుడి వివాహ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నామని తమ న్యాయవాది ద్వారా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పోలీసులు మూడోసారి సమన్లు జారీ చేయగా వారు బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో పోలీసులు సరైన విచారణ చేయట్లేదని కంగనా, రంగోలి తమ ట్వీట్లలో విమర్శలు గుప్పించారు. అదే సమయంలో చాలామంది నటీనటులపై వ్యక్తిగత విమర్శలు చేశారు. వారు బాలీవుడ్‌ ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని మున్వర్‌ అలీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ ఫిర్యాదుపై విచారణ చేయాలని బాంద్రా మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేటు కోర్టు ముంబై పోలీసులను ఆదేశించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని