కర్ణాటకలో రైస్‌ ఏటీఎమ్‌లు

చౌకధర దుకాణాల వద్ద రేషన్‌ కార్డు వినియోగదారుల ఇబ్బందులు తొలగించేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో బియ్యం సరఫరా యంత్రాలను(రైస్‌ ఏటీఎం) రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది.

Published : 11 Sep 2020 01:44 IST

బెంగళూరు: చౌకధర దుకాణాల వద్ద రేషన్‌ కార్డు వినియోగదారుల ఇబ్బందులు తొలగించేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో బియ్యం సరఫరా యంత్రాలను(రైస్‌ ఏటీఎం) రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా చౌకధర దుకాణాల ముందు ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితిని నివారించవచ్చని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి కె.గోపాలయ్య ఓ మీడియాతో వెల్లడించారు.

‘రాష్ట్రంలో రైస్‌ ఏటీఎంలను ప్రారంభించేందుకు యోచిస్తున్నాం. దీని ద్వారా రేషన్‌ దుకాణల వద్ద ప్రజలు ఎదుర్కొనే పలు ఇబ్బందులు దూరమవుతాయి. మొదట పైలట్‌ ప్రాజెక్టుగా రెండు యంత్రాల్ని తెప్పించనున్నాం. అందులో ఫలితం బాగుంటే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం. దీని ద్వారా పేదలు రోజులో ఎప్పుడైనా పీడీఎస్‌ కేంద్రానికి వెళ్లి బియ్యం తెచ్చుకోవచ్చు. బ్యాంక్‌ ఏటీఎంల మాదిరిగానే స్మార్ట్‌కార్డ్‌ సదుపాయాన్ని కల్పిస్తాం’ అని తెలిపారు. ఈ పద్ధతిని మొదట కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ సమయంలో వియత్నాం, ఇండోనేషియాలో ఉపయోగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని