కేటీఆర్‌ బర్త్‌ డే ..పాట విడుదల చేసిన కవిత

తెలంగాణ పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని, ఆయన సోదరి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓ పాటను విడుదల చేశారు.

Published : 23 Jul 2020 22:28 IST

హైదరాబాద్‌: తెలంగాణ పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని, ఆయన సోదరి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓ పాటను విడుదల చేశారు. మిట్టపల్లి సురేందర్‌ రచించిన గీతాన్ని యాజీన్‌ నిజార్‌ ఆలపించారు. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌ భార్య శ్రీదేవి యాదవ్ నిర్మాతగా వ్యవహరించారు. సంగీతం భరత్ అడోనిస్, కొరియో గ్రాఫర్ శేఖర్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్, ఎడిటర్ వర ప్రసాద్ తదితరులు ఈ పాటను ప్రత్యేకంగా రూపొందించారు. 

ఈ ప్రత్యేక గీతం రూపొందించడంలో సహకరించిన మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ సామ వెంకట్ రెడ్డి, కొండ శరత్‌కు ఈ సందర్భంగా శ్రీదేవి యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ ఆడియో సంస్థ  మధుర ఆడియో ద్వారా ఈ పాట విడుదలైంది. కేటీఆర్‌ శుక్రవారం తన 45వ పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని