వద్దన్నా.. వినరే!

వినాయక చవితి సందర్భంగా ఏటా ఖైరతాబాద్‌ గణపయ్యను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలిరావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ ఏడాది మాత్రం కొవిడ్‌ కారణంగా భక్తులు ఎవరూ దర్శనానికి రావొద్దని నిర్వాహకులు...

Published : 23 Aug 2020 09:14 IST

హైదరాబాద్‌: వినాయక చవితి సందర్భంగా ఏటా ఖైరతాబాద్‌ గణపయ్యను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలిరావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ ఏడాది మాత్రం కొవిడ్‌ కారణంగా భక్తులు ఎవరూ దర్శనానికి రావొద్దని నిర్వాహకులు ముందుగానే ప్రకటించారు. అయినా పట్టించుకోకుండా గణపయ్యను దర్శించుకునేందుకు మొదటి రోజే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓ వైపు నిర్వాహకులు ఆన్‌లైన్‌ దర్శనం చేసుకోవాలని భక్తులకు సూచించినప్పటికీ పట్టించుకోకుండా వినాయకుడిని చూసేందుకు ప్రజలు పోటీ పడ్డారు. కొందరు సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు. కొందరు భక్తులు కొవిడ్‌ నిబంధనలకు వ్యతిరేకంగా మాస్క్‌లు ధరించకుండా దర్శనానికి వచ్చారు.

ఖైరతాబాద్‌లోని గణపయ్య ధన్వంతరి నారాయణుడిగా భక్తులకు దర్శనిమస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ దఫా విగ్రహం నిర్మాణాన్ని 9 అడుగులకే పరిమితం చేశారు. కొవిడ్‌ మహమ్మారికి ఔషధం తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా స్వామి దర్శనమిస్తున్నారు. చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో ఉన్న వినాయకుడికి కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతి కొలువుదీరారు. కరోనా దృష్ట్యా భక్తులకు నేరుగా అనుమతి లేదని.. www.ganapathideva.org   వెబ్‌సైట్‌ ద్వారా పూజా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని