
Updated : 01 Sep 2020 19:48 IST
ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర
హైదరాబాద్: భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. ప్రసిద్ధ ఖైరతాబాద్ గణపతి గంగమ్మ ఒడికి చేరేందుకు బయల్దేరాడు.భక్తుల నృత్యాలు, జయజయధ్వానాల మధ్య లంబోధరుడు పయనం సాగిస్తున్నాడు. ఈ సారి ఖైరతాబాద్ గణపతి ఈ దఫా ‘ధన్వంతరి నారాయణ’గా దర్శనమిచ్చారు. కరోనా కారనంగా కేవలం 9 అడుగుల మట్టి విగ్రహంగా రూపుదిద్దుకున్న ఈ స్వామి చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో పాటు కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమ సరస్వతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. కోల్‌కతా ముత్యాలు, గిల్టు వజ్రాల నగలతో స్వామికి గొడుగు రూపొందించారు.
Advertisement
Tags :