టిమ్స్‌లో వసతులపై కిషన్‌రెడ్డి అసంతృప్తి

గచ్చిబౌలి టిమ్స్‌ ఆసుపత్రిలో అందుతోన్న వైద్యం, వసుతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వసతులను

Updated : 01 Aug 2020 13:34 IST

హైదరాబాద్: గచ్చిబౌలి టిమ్స్‌ ఆసుపత్రిలో అందుతోన్న వైద్యం, వసుతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వసతులను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆసుపత్రిలో అవసరమైన సదుపాయాలు కల్పించి.. పూర్తి స్థాయి సిబ్బందిని భర్తీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఆసుపత్రిలో వెయ్యి పడకలు ఏర్పాటు చేయాలని కోరారు. గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆసుపత్రిని కిషన్‌ రెడ్డి శనివారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...

‘‘హైదరాబాద్‌లో కరోనా టెస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. టెస్టుల సంఖ్య ఎంత పెంచితే అంత మేరకు కరోనా మహమ్మారిని అరికట్టవచ్చు. రెండో దశలో మరిన్ని ఆసుపత్రులను సందర్శించా. గచ్చిబౌలి టిమ్స్‌, ఎర్రగడ్డ ఆయుర్వేదిక్‌, గాంధీ ఆసుపత్రిలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నా. ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితుల కోసం పడకలు మరిన్ని పెంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తోంది. హైదరాబాద్‌లోని అన్ని బస్తీల్లో ప్రజలకు కరోనా పరీక్షలు చేయాలి. కొవిడ్‌ పరీక్షల కోసం ఎవరొచ్చినా కచ్చితంగా చేయాల్సిందే. దేశరాజధాని దిల్లీలో కొవిడ్‌ టెస్టుల సంఖ్య పెంచడం వల్ల పాజిటివ్‌ కేసులు తగ్గాయి. ప్రస్తుతం దిల్లీలో 84 శాతం రికవరీ రేటు ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు దిల్లీని ఆదర్శంగా తీసుకోవాలి. ఆగస్టు నెలంతా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి’’ అని కిషన్‌ రెడ్డి అన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని