లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌ మెట్రోకు భారీ నష్టం

కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ ప్రభావం ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంస్థపై తీవ్రంగా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో......

Updated : 17 Oct 2020 04:59 IST

హైదరాబాద్‌: కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ ప్రభావం ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంస్థపై తీవ్రంగా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు మాసాల కాలంలో రూ.916 కోట్ల మేర నష్టం వచ్చినట్టు ఆ సంస్థ వెల్లడించింది. సుదీర్ఘకాలం పాటు లాక్‌డౌన్‌ విధించడం కారణంగా కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఇంత నష్టం వాటిల్లినట్టు ఆ సంస్థ పేర్కొంది. తొలి ఆరు నెలల కాలంలో కార్యకలాపాల వల్ల కేవలం రూ.60 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరినట్లు కంపెనీ తెలిపింది.

కరోనా నేపథ్యంలో మార్చి ఆఖరి వారంలో మెట్రో రైలు సేవలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, అన్‌లాక్‌-4లో భాగంగా సెప్టెంబర్‌ 7 నుంచి ఈ సర్వీసులు పునరుద్ధరించేందుకు అవకాశం కల్పించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంస్థ రూ.383 కోట్ల నష్టాన్ని చవిచూసింది. లాక్‌డౌన్‌ కారణంగా సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో ఆ కాలానికి రాయితీ వ్యవధిని పొడిగించాలని ఎల్‌అండ్టీ సంస్థ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని