గుడ్డులాంటిదే మనిషి తల.. కాపాడుకోవాలి మరి!

ప్రభుత్వం, పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా ఇప్పటికీ కొంత మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించకుండా రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించేదుకు ఎల్బీనగర్‌ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఎల్బీనగర్‌ ట్రాఫిక్‌ అదనపు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగమల్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హెల్మెట్‌ లేకుండా..

Published : 28 Dec 2020 01:22 IST

ఎల్బీనగర్‌ ట్రాఫిక్ పోలీసులు వినూత్న అవగాహన

మలక్‌పేట: ప్రభుత్వం, పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా ఇప్పటికీ కొంత మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించకుండా రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించేందుకు ఎల్బీనగర్‌ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఎల్బీనగర్‌ ట్రాఫిక్‌ అదనపు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగమల్లు హెల్మెట్‌ లేకుండా రహదారిపైకి వచ్చిన ద్విచక్రవాహనదారులకు ఒక్కొక్కరికి ఒక్కో కోడిగుడ్డు చేతిలో పెట్టారు. ఈ కోడిగుడ్డు లాంటిదే మనిషి తల అని.. ఒకసారి ప్రమాదానికి గురైతే ప్రాణాలు పోవడమే కానీ తిరిగి మామూలుగా అవడమంటూ ఉండదని చెబుతూ అవగాహన కల్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ద్విచక్రవాహన ప్రమాదాల్లో అత్యధిక శాతం తలకు గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనం నడపడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కోడి గుడ్డులాగే మన తల కూడా చాలా సున్నితమైనది. ఎన్నిసార్లు చెప్పినా కొంత మంది ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎంతో మంది వారి ఆప్తులను కోల్పోతున్నారు. బయటకు వచ్చాక ఇంటి దగ్గర మన కోసం ఓ కుటుంబం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి’’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని