ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

రాష్ట్రంలో అనధికార ఫ్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్‌కు 19.33లక్షల దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది. 

Updated : 12 Oct 2022 11:56 IST


హైదరాబాద్‌: రాష్ట్రంలో అనధికార ఫ్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్‌కు 19.33లక్షల దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది. 
ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు దారుల నుంచి  భారీ స్పందన వస్తోంది. దీంతో రోజురోజుకీ దరఖాస్తుల సంఖ్య ఎక్కువ అవుతోంది. ఈ నెల 15 దరఖాస్తు గడువు ముగింపు కావడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగింది. గత రెండు రోజులుగా దరఖాస్తు చేయడానికి ప్రయత్నిస్తున్న వారిని సాంకేతిక సమస్యలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మరింత మంది దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించే దిశగా పురపాలక అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ నెలాఖరు వరకు దరఖాస్తు గడువును పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని