ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియలు

ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా?లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొండ చరియలు విరిగిపడటంతో ఓ రేకుల షెడ్డు పూర్తిగా

Published : 22 Oct 2020 01:14 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా?లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొండ చరియలు విరిగిపడటంతో ఓ రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారా? అనే కోణంలో శిథిలాలను వేగంగా తొలగిస్తున్నారు. కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో ఇప్పటికే దర్శనాలు నిలిపివేశారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు కాసేపట్లో సీఎం జగన్ ఇంద్రకీలాద్రికి‌ రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆ ప్రదేశంలో రాకపోకలు నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది. 

  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని