త్వరలో ‘లవ్‌జిహాద్‌’ వ్యతిరేక చట్టం తెస్తాం 

ప్రేమ, పెళ్లిళ్ల పేరుతో మత మార్పిడులు (లవ్‌ జిహాద్‌) చేసే వారికి అడ్డుకట్ట వేసేందుకు త్వరలో ఒక చట్టం తీసుకురానున్నట్లు మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్ర మంగళవారం తెలిపారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామని ఆయన అన్నారు.

Published : 18 Nov 2020 01:00 IST

* మధ్యప్రదేశ్ హోంమంత్రి

భోపాల్‌: ప్రేమ, పెళ్లిళ్ల పేరుతో మత మార్పిడులు (లవ్‌ జిహాద్‌) చేసే వారికి అడ్డుకట్ట వేసేందుకు త్వరలో ఒక చట్టం తీసుకురానున్నట్లు మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా మంగళవారం తెలిపారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామని ఆయన అన్నారు. ఇందులో భాగంగా నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, ఐదేళ్లు కఠినకారాగార శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రక్రియలో పాలు పంచుకున్నవారు కూడా శిక్షార్హులవుతారని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా స్వచ్ఛంద మత మార్పిడి కోసం నెల రోజులు ముందుగా కలెక్టరుకు దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని