పట్టపగలు వీధుల్లో చిరుత సంచారం

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోనూ ఓ చిరుత కలకలం సృష్టించింది. పట్టపగలే వీధుల్లోకి రావడంతో స్థానికులు హడలిపోయారు....

Published : 25 Nov 2020 22:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జనావాసాల్లోకి చిరుతల సంచారం రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోనూ ఓ చిరుత కలకలం సృష్టించింది. పట్టపగలే వీధుల్లోకి రావడంతో స్థానికులు హడలిపోయారు. చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రియార్డయ్యాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది అతికష్టంమీద చిరుతను పట్టుకున్నారు. కొన్ని గంటలపాటు సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టిన వన్యమృగం చివరకు బోనులో చిక్కింది. అనంతరం దాన్ని అడవిలో వదిలేశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని