9 నెలల తర్వాత తెరుచుకున్న లింగరాజ్‌ ఆలయం

ఒడిశాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన లింగరాజ్‌ ఆలయం తొమ్మిది నెలల తర్వాత తిరిగి తెరుచుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఇన్ని రోజులు ఆలయాన్ని మూసివేశారు. కరోనా మార్గదర్శకాల కింద కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆలయం తెరిచేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ఆలయార్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రవేశం చేశారు.

Published : 28 Dec 2020 00:03 IST

భువనేశ్వర్‌: ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లింగరాజ్‌ ఆలయం తొమ్మిది నెలల తర్వాత తిరిగి తెరుచుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఇన్ని రోజులు ఆలయాన్ని మూసివేశారు. కరోనా మార్గదర్శకాల కింద కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆలయం తెరిచేందుకు ఒడిశా ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ఆలయార్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రవేశం చేశారు. అయితే.. మొదటి రోజు కావడంతో ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. కేవలం అర్చకులు, సేవకులు వారి కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించారు. వీరికి ఈనెల 31 వరకు ఆలయంలోపల పూజలు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కరోనా నెగెటివ్‌ రిపోర్టుతో భక్తులు జనవరి 3వ తేది నుంచి స్వామి వారిని దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఇందుకు ఆలయ సమీపంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు ముందు కరోనా పరీక్షలు చేసిన తర్వాతే లోపలికి అనుమతించనున్నారు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని