మారడోనాకు నివాళి.. మెస్సీకి జరిమానా

ఇటీవల కన్నుమూసిన అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మరడోనాకు నివాళులు అర్పించినందుకు సాకర్‌ స్టార్‌ ఆటగాడు లియోనల్‌ మెస్సీకి స్పానిష్‌ సాకర్‌ ఫెడరేషన్‌ 600యూరోలు(దాదాపు రూ. 54వేలు) జరిమానా విధించింది. స్పానిష్‌ లీగ్‌లో మెస్సీ బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లీగ్‌లో భాగంగా గత ఆదివారం బార్సిలోనా

Published : 04 Dec 2020 01:32 IST

స్పెయిన్ : ఇటీవల కన్నుమూసిన అర్జెంటీనా ఫుట్‌బాల్‌ మాంత్రికుడు డీగో మారడోనాకు నివాళులు అర్పించినందుకు సాకర్‌ స్టార్‌ ఆటగాడు లియోనల్‌ మెస్సీపై స్పానిష్‌ సాకర్‌ ఫెడరేషన్‌ తీవ్రంగా స్పందించింది. 600యూరోలు జరిమానా విధించింది. స్పానిష్‌ లీగ్‌లో మెస్సీ బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లీగ్‌లో భాగంగా గత ఆదివారం బార్సిలోనా ఒసాసునా జట్టుతో తలపడింది. మ్యాచ్‌లో గోల్‌ చేసిన అనంతరం మెస్సీ మారడోనాకు నివాళులు అర్పిస్తున్నట్లు తను వేసుకున్న జెర్సీ తీసేసి లోపల ఉన్న మారడోనా జెర్సీని ప్రదర్శించాడు. దీంతో మ్యచ్‌ రెఫరీ వెంటనే మెస్సీకి ఎల్లోకార్డును చూపించారు.  

దీనిపై స్పందించిన స్పానిష్‌ సాకర్‌ ఫెడరేషన్‌ మెస్సీతో పాటు బార్సిలోనాక్లబ్‌కు సౌతం 180యూరోలు జరిమానా విధించింది. మెస్సీ ఉద్దేశంలో తప్పు లేకున్నా లీగ్‌లో ఇలా జెర్సీలను ప్రదర్శించడం నిబంధనలకు విరుద్ధమని ఫెడరేషన్‌ వివరించింది. మెస్సీతోపాటు బార్సిలోనా క్లబ్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండే ఈ మ్యాచ్‌లో బార్సిలోనా 4- 0 గోల్స్‌తో గెలుపొందింది. మ్యచ్‌ అనంతరం మారడోనా జెర్సీ ధరించిన ఫొటోను మెస్సీ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘ఫెర్‌వెల్‌ డీగో’ అంటూ మెస్సీ స్పానిష్‌లో పోస్టుకు వ్యాఖ్యను జోడించారు. మెస్సీ కూడా అర్జెంటీనాకు చెందినవారే.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని