ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రానున్న 24 గంటల్లో బలపడనుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ

Updated : 30 Nov 2020 13:34 IST

విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రానున్న 24 గంటల్లో బలపడనుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. బుధవారం సాయంత్రానికి శ్రీలంక సమీపంలో తీరం దాటే అవకాశమున్నట్లు తెలిపింది. దీని ప్రభావం వల్ల బుధ, గురువారాల్లో దక్షిణ కోస్త జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని