మరో ఐదు లక్షల యువతకు శిక్షణ: మహీంద్రా

వచ్చే ఐదేళ్లలో మరో 5లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు మహీంద్రా గ్రూప్‌ సిద్దమవుతోందని వారు గురువారం ప్రకటించారు.

Updated : 17 Dec 2020 18:44 IST

ముంబయి: వచ్చే ఐదేళ్లలో మరో ఐదు లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు మహీంద్రా గ్రూప్‌ సిద్దమవుతోందని వారు గురువారం ప్రకటించారు. గత పదిహేనేళ్లలో ‘మహీంద్రా ప్రైడ్‌ స్కూల్స్‌’(ఎమ్‌పీఎస్‌), తరగతులతో ఇప్పటికే ఐదు లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణతో పాటు లక్ష మందికి ఉద్యోగాలు కల్పించామని వారు ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంలోని బలహీన వర్గాల్లోని ప్రతిభావంతులను వెలికితీసే లక్ష్యంతో మహీంద్రా ప్రైడ్‌ స్కూల్స్‌ ప్రారంభించారు. ‘‘గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.’’ అని మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్పొరేట్ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్‌)లో భాగంగా ఎనిమిదేళ్ల క్రితం 2005లో మహీంద్రా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎమ్‌పీఎస్‌ కేంద్రాలు చెన్నై, పూణె, చండీగఢ్‌, హైదరాబాద్, శ్రీనగర్, పాట్నా , వారణాసిల్లో ఉన్నాయి. వారు విడుదల చేసిన ప్రకటలోని వివరాల ప్రకారం.. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించేందుకు మహీంద్రా గ్రూప్‌ నాంది ఫౌండేషన్‌ సహకారంతో కొవిడ్-19 తర్వాతి కాలానికి కావల్సిన ఉపాధి నైపుణ్యాలను అందించేందుకు కృషి చేస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వ్యవసాయం, ఆరోగ్యం, ఈ-కామర్స్‌ వంటి వాటికి శిక్షణ కార్యక్రమాలను విస్తరిస్తున్నామన్నారు. రాబోయే ఏళ్లలో ఉద్యోగ కల్పనలో వేగాన్ని పెంచుతామని వారు తెలిపారు. నాంది ఫౌండేషన్‌ సీఈవో మనోజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. మన దేశంలో తగినంత జనాభా ఉన్నా, వారి ఆర్థిక పరిస్థితులననుసరించి ఉద్యోగాల కోసం వెళ్లట్లేదన్నారు. ఎంపీఎస్‌ కార్యక్రమం ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను రూపొందించామన్నారు. దీని ద్వారా వారికి సురక్షితమైన ఆదాయమార్గం కల్పించడమే  ధ్యేయమని తెలిపారు.

ఇదీ చదవండి..

జనవరి 1 నుంచి వాహనధరల పెంపు: మహీంద్రా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని