ఆనందం ఎక్కడ దొరుకుతుందో చెప్పిన మహీంద్రా
ఆనందం ఎక్కడ దొరుకుతుంది..? ఈ ప్రశ్న ఒక్కటే కానీ దానికి సమాధానాలే రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన ఆనందం. కొందరు కూనిరాగం తీస్తూ తమలో తాము లీనమై అనందాన్ని పొందితే..
ఇంటర్నెట్ డెస్క్: ఆనందం ఎక్కడ దొరుకుతుంది..? ఈ ప్రశ్న ఒక్కటే కానీ దానికి సమాధానాలే రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన ఆనందం. కొందరు కూనిరాగం తీస్తూ తమలో తాము లీనమై ఆనందాన్ని పొందితే..మరొకరు ఇతరులను ఆదుకోవడంలో ఆనందాన్ని పొందుతారు..ఇంకొకరు జీవితంలో తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిచడం ద్వారా ఆనందాన్ని పొందామంటారు. అయితే దీన్ని ఎవరికి వారే తమ సొంతంగా పెంపొందించుకోవాల్సిందే కానీ ఇతరుల నుంచి బహుమతిగానో లేదా ఇంకోరకంగానో పొందలేమనేది జీవిత సత్యం. దీనిని తెలియజేస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురువారం ఒక ట్వీట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉండే మహీంద్రా లాంటి వ్యక్తి జీవిత పాఠానికి సంబంధించి షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఆయన షేర్ చేసిన పోస్ట్‌లో ఒక డ్రాయింగ్ ఉంది. అందులో ఒక వ్యక్తి హ్యాపినెస్ అని రాసి ఉన్న బోర్డు పట్టుకుని ఉంటాడు. మరో వ్యక్తి అతణ్ని ‘‘అది నీకు ఎక్కడ దొరికింది. దాని కోసం నేను చాలా చోట్ల వెతుకున్నాను అని అడుతాడు. దానికి ఆ వ్యక్తి దీన్ని నాకు నేనుగా పొందాను అని సమాధామిస్తాడు.’’ ఈ డ్రాయింగ్‌ని మహీంద్రా షేర్ చేస్తూ ‘‘ఒక ఫొటో వెయ్యి పదాలకు సమానం అని చాలా మంది చెప్తుంటారు. అది నిజమే.. కొన్నిసార్లు సాధారణ డ్రాయింగ్ కూడా వెయ్యి ఫొటోలకు సమానమనిసిస్తుంది ’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘అవును..ఆనందం ఒకరు ఇచ్చేది కాదు..మనకి మనమే సొంతంగా పొందాలి’, ‘ఆనందంగా ఉండటం ఎంతో సింపుల్..కానీ చాలా మంది సింపుల్‌గా ఉండటం కష్టంగా భావిస్తారు అని ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్‌పై డిస్కౌంట్.. ఈ సబ్‌స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్‌పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి