ఆకాశంలోంచి ఊడిపడ్డ అదృష్టం!

ఆరు బయట పనిచేసుకుంటుండగా ఆయన రేకు ఇంటి పైకప్పుపై ఏదో భారీ వస్తువు పడిన శబ్దం వినిపించింది.

Published : 21 Nov 2020 01:45 IST

ఇంటర్నెట్ డెస్క్: అదృష్టం ఉన్నప్పుడు తంతే బూరెల బుట్టలో పడతారు అని అంటారు. ఇండోనేషియాకు చెందిన జోసువా హుతాగలంగ్‌ అనే 33 ఏళ్ల వ్యక్తి జీవితంలో కూడా అదే జరిగింది. సుమత్రాలో నివసించే ఈయన  వృత్తి రీత్యా శవపేటికలు తయారు చేస్తుంటాడు. జోసువా ఓ రోజు ఆరు బయట పనిచేసుకుంటుండగా.. ఆయన రేకు ఇంటి పైకప్పుపై ఏదో భారీ వస్తువు పడిన శబ్దం వినిపించింది. ఏమిటా అని వెతికిన జోసువా తన ఇంటి పైకప్పు విరిగిపోయి ఉండటం గమనించాడు. దానిని సరిచేసేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇంకా వేడిగా ఉన్న ఓ రాయి కనిపించింది.

ఆ వ్యక్తి దాని చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. అది 450 కోట్ల సంవత్సరాల వయసున్న అత్యంత అరుదైన కార్బోనాసియస్‌ క్రోండైట్‌ అనే అంతరిక్ష శిల అని పలువురు అంచనా వేస్తున్నారు.  దీని విలువ గ్రాముకు సుమారు రూ. 63 వేలు అని తెలిసింది. తనకు దొరికిన రాయి బరువు 2.1 కేజీలు కావటంతో జోసువాకు ఒకే దెబ్బతో కోట్లకు అధిపతై కూర్చున్నాడు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని