
ప్రపోజ్ చేసి నీళ్లలో పడ్డాడు..
ఇంటర్నెట్ డెస్క్: ఓ వివాహ ప్రతిపాదన దారుణంగా విఫలమైంది. ఇద్దరికి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. తీరంలో పడవలో ఉన్న వ్యక్తి మరో పడవలోని మహిళ వద్దకు వెళ్లి వివాహ ప్రతిపాదనను ఆమె ముందుంచాడు. దానికి సదరు మహిళ అంగీకారం కూడా తెలుపుతుంది. కానీ అంతలోనే మహిళ ఉన్న పడవ ముందుకెళ్లడంతో ఆమె ఒక్కసారిగా పడిపోతుంది. మరో పడవ అంచుమీద ఉన్న సదరు వ్యక్తి తలకు ఆమె కాలు తాకడంతో అతడు నీటిలో పడిపోతాడు. దీంతో ఆ ప్రతిపాదన కాస్తా ప్రమాదానికి దారితీసినట్లయింది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన పలువురు సరదా వ్యాఖ్యానాలు జోడిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.